'కాంగ్రెస్ రాజకీయ వైఖరే కారణం' | congress responsible for bringing shame to Indian democracy: Arun jaitley | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ రాజకీయ వైఖరే కారణం'

Feb 14 2014 2:43 PM | Updated on Mar 29 2019 9:18 PM

'కాంగ్రెస్ రాజకీయ వైఖరే కారణం' - Sakshi

'కాంగ్రెస్ రాజకీయ వైఖరే కారణం'

పార్లమెంట్లో గురువారం జరిగిన సంఘటనకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు.

న్యూఢిల్లీ : పార్లమెంట్లో గురువారం జరిగిన సంఘటనకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధానమంత్రి, హోంశాఖ సభను సక్రమంగా నడిపించటంతో విఫలమయ్యారని ఆయన శుక్రవారమిక్కడ ఆరోపించారు. తెలంగాణ బిల్లు పెడుతూ సీమాంధ్ర సమస్యలకు హామీ ఇస్తే ఈ గొడవ జరిగేది కాదని అరుణ్ జైట్లీ అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వైఖరే ఇందుకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ తాము కట్టుబడే ఉన్నామని బీజేపీ లోక్సభ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ మరోవైపు తన ట్విట్టర్లో స్పష్టం చేశారు.  తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement