కరోనా: కమ్యూనిటీ ట్రాన్స్​మిషన్‌‌పై కీలక సమావేశం | Conference On Corona Community Transmission Assessment in Delhi | Sakshi
Sakshi News home page

కరోనా: కమ్యూనిటీ ట్రాన్స్​మిషన్‌‌పై కీలక సమావేశం

Jun 9 2020 11:46 AM | Updated on Jun 9 2020 11:55 AM

Conference On Corona Community Transmission Assessment in Delhi - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కరోనా వైరస్‌ కమ్యూనిటీ వ్యాప్తిని ఎదుర్కోవడానికి తదుపరి వ్యూహాన్ని నిర్ణయించడానికి రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(ఎస్‌డీఎమ్‌ఏ) నేడు కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) అనిల్‌ బైజల్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అనారోగ్యం కారణంగా సీఎం స్థానంలో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. (24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు)

ఢిల్లీలో వైరస్ వ్యాప్తి సామూహిక వ్యాప్తి దశకు చేరిందని ఎయిమ్స్ చీఫ్ ,ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ సహా పలువురు వైద్య నిపుణులు  పేర్కొన్నారు. ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఢిల్లీలో ఒక్కరోజులో 1007 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 17 మంది మృతిచెందారు. దీంతో మొత్తం 29,943 కేసులు, 874 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 17,712 యక్టీవ్ కేసులు ఉన్నాయి. 11357 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. (కరోనా: కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement