తమిళనాడులోని ఊటీ అడవుల్లో మావోయిస్టుల కోసం వేట ముమ్మరమైంది.
తమిళనాడులోని ఊటీ అడవుల్లో మావోయిస్టుల కోసం వేట ముమ్మరమైంది. గిరిజన ప్రాంతాల్లో తమ కార్యకలాపాలకు అధికారులు అడ్డం పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ ఇటీవలే నలుగురు సాయుధుల బృందం ఒకటి ఓ కానిస్టేబుల్ను బెదిరించింది. దీంతో ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారని భావించిన పోలీసు అధికారులు.. ఊటీ కొండలు సహా తమిళనాడులోని పలు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశారు.
కేరళలోని మనంతవాడి ప్రాంతంలో ప్రమోద్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంట్లోకి ఓ మహిళ సహా నలుగురు మావోయిస్టులు దూసుకెళ్లి, చంపుతామని బెదిరించారని పోలీసువర్గాలు అంటున్నాయి. అతడి మోటారు సైకిల్ను మావోయిస్టులు తగలబెట్టారు. దీంతో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం అటవీశాఖాధికారులతో కలిసి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల వేట ముమ్మరంగా సాగిస్తోంది.