దేశంలో తొలిసారి: కుక్కకు పేస్‌మేకర్‌ | This Cocker Spaniel Is The First Dog To Get A Pacemaker In India | Sakshi
Sakshi News home page

కుక్కకు పేస్‌మేకర్‌

Feb 10 2020 10:50 AM | Updated on Feb 10 2020 10:50 AM

This Cocker Spaniel Is The First Dog To Get A Pacemaker In India - Sakshi

భారత్‌లో తొలిసారి ఓ కుక్కకు పేస్‌మేకర్‌ విజయవంతంగా అమర్చారు.

న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి ఓ కుక్కకు పేస్‌మేకర్‌ విజయవంతంగా అమర్చారు. కాకర్‌ స్పేనియల్‌ జాతికి చెందిన కుక్క ఖుషి (7.5 ఏళ్లు)కి ఢిల్లీలోని మాక్స్‌ వెటర్నరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్‌ జరిగింది. ఆపరేషన్‌కు ముందు కుక్క గుండె వేగం నిమిషానికి 20కి పడిపోయిందని, కుక్కల సాధారణ గుండె వేగం నిమిషానికి 60–120 సార్లు ఉంటుందని వైద్యులు తెలిపారు. గతేడాది డిసెంబర్‌ 15న దాదాపు గంటన్నర పాటు ఈ ఆపరేషన్‌ జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ శునకం పరిస్థితి సాధారణంగా ఉందని దాని యజమాని మను మీడియాకు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement