
విజయవాడ/హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్-2019 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరుగుతోంది. మొత్తం 72 నగరాల్లో ఈ పరీక్ష కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జనరల్ స్టడీస్.., మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆప్షన్ సబ్జెక్ట్ పరీక్షలు ఉండనున్నాయి. సివిల్ ప్రిలిమినరీ పరీక్ష కోసం హైదరాబాద్‌లో 103 పరీక్షా కేంద్రాలు, విజయవాడలో 22 కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలో జరుగుతున్న పిలిమినరీ పరీక్ష రాసేందుకు పలువురు దివ్యాంగ అభ్యర్థులు హాజరయ్యారు.
విజయవాడలో సివిల్స్ పిలిమినరీ పరీక్ష రాసేందుకు హాజరైన దివ్యాంగ అభ్యర్థులు.. (ఫొటోలు)