
సివిల్స్ అభ్యర్థులతో అడిషనల్ డీజీ మహేష్ భగవత్
సాక్షి,హైదరాబాద్: తాజాగా విడుదలైన సివిల్స్ పరీక్షల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ గైడెన్స్ మంచి ఫలితాలను ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ పొందుతున్న వారితో ప్రత్యక్షంగా, ఇతర రాష్ట్రాల వారితో ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా మహేష్‌భగవత్ ఇచ్చిన సూచనలతో సుమారు రెండువందల మందికి పైగా ర్యాంకులు సాధించారు.
అందులో తెలంగాణా నుండి అనన్యారెడ్డి సహా ఎన్‌పీఎలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. సివిల్స్ ప్రిపేరు అయ్యే వారికి వ్యక్తిత్వ వికాసం, పరీక్షా సమయాల్లో వత్తిడి,సమయ పాలన, ఇంటర్వ్యూలో వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై మహేష్ భగవత్ సూచనలు చేశారు.