హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ | Chopper Makes Emergency Landing In Assam's Nagaon; Narrow Escape For 8 | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

Sep 15 2016 5:04 PM | Updated on Sep 4 2017 1:37 PM

హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

గౌహతి నుంచి ఈటానగర్ కు బయలు దేరిన ఎమ్ ఐ 17 హెలికాప్టర్ అత్యవసరంగా అసోంలోని నాగావ్ లో ల్యాండ్ అయ్యింది.

నాగావ్: గౌహతి నుంచి  ఈటానగర్ కు బయలు దేరిన ఎమ్ ఐ 17 హెలికాప్టర్  అత్యవసరంగా అసోంలోని నాగావ్ లో ల్యాండ్ అయ్యింది. హెలికాప్టర్ నుంచి ఇంధనం లీకవుతుండటం పైలట్  గుర్తించిడమే ఇందుకు కారణం. ఇందులో ఇద్దరు ప్రయాణీకులతో పాటు ఆరుగురు స్కైవన్ ఎయిర్ వేస్ కు చెందిన సిబ్బంది ఉన్నారు. స్కైవన్ ఎయిర్ వేస్ సంస్థ గౌహతి నుంచి ఈటానగర్ కు 290 కి.మీ మేర సర్వీసును అందిస్తుంది.

2011 ఏప్రిల్ లో ఎమ్ ఐ-17 హెలికాప్టర్ తవాంగ్ లో ప్రమాదానికి గురైంది. ఇందులో 17  మంది మృత్యువాతపడ్డారు.  అప్పటి నుంచి ప్రయాణీకులను తరలింరాదని  ఈ సర్వీసులపై డీజీసీఏ నిషేధం విధించింది.   అరుణాచల్ ప్రదేశ్ దివంగత  సీఎం  దోర్జీ ఖండూ సైతం చాపర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆ రాష్ట్రంలో వాతావరణం ఆకాశ ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement