సినిమా చూసి హత్యచేశాడు! | child girld murdered | Sakshi
Sakshi News home page

సినిమా చూసి హత్యచేశాడు!

Dec 8 2017 12:51 AM | Updated on Aug 13 2018 4:19 PM

child girld murdered - Sakshi

చండీగఢ్‌: సినిమా ప్రభావంతో ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసిన ఓ టీనేజ్‌ అబ్బాయి(16) చివరికి ఆ బాలికను నీటి తొట్టెలో ముంచి దారుణంగా హత్యచేసిన ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. తన బావ అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కూతు రిని బుధవారం చాక్లెట్ల ఆశ చూపి నిందితుడు ఇంట్లోకి ఆహ్వానించినట్లు అంబాలా ఎస్పీ అభిషేక్‌ జోర్వాల్‌ మీడియాకు తెలిపారు. ఈ సమయం లో నిందితుడి బావ, కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారన్నారు.

అనంతరం బాలికను నిందితుడు ఇంట్లో నిర్బంధించాడన్నారు. తమ కుమార్తె కన్పించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే నిందితుడు వారికి ఫోన్‌ చేసి రూ.20 లక్షలు డిమాండ్‌ చేశాడని అభిషేక్‌ పేర్కొన్నారు. దీంతో తాము ఆ కాల్‌ను ట్రేస్‌ చేశామన్నారు. కిడ్నాప్‌ వ్యవహారం పోలీసులకు తెలిసిపోయిందని అర్థమవడంతో నిందితుడు సదరు చిన్నారిని నీటి తొట్టెలో ముంచి హత్యచేశాడన్నారు.

అనంతరం చిన్నారి మృతదేహాన్ని వాటర్‌ కూలర్‌లో దాచాడని తెలిపారు. ఆ ఇంటిపై అర్ధరాత్రి 1 గంట సమయం లో దాడిచేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతను చేసిన తప్పుకు ఎంతమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదనీ.. ఓ సినిమాలో చూపినట్లు ఈజీ మనీ కోసమే చిన్నారిని కిడ్నాప్‌చేసినట్లు వెల్లడిం చాడని పేర్కొన్నారు. నిందితుడి బావ చనిపోయిన బాలిక తండ్రి షాప్‌లోనే పనిచేస్తాడన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement