శారదా ఛార్జిషీటులో చిదంబరం భార్య | Chidambaram's wife named in Saradha chargesheet | Sakshi
Sakshi News home page

శారదా ఛార్జిషీటులో చిదంబరం భార్య

Jan 5 2016 10:12 AM | Updated on Sep 3 2017 3:08 PM

శారదా ఛార్జిషీటులో చిదంబరం భార్య

శారదా ఛార్జిషీటులో చిదంబరం భార్య

దేశంలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం కేసుకు సంబంధించిన ఛార్జిషీటులో మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం భార్య నళిని చిదంబరం పేరును చేర్చారు.

కోల్కతా: దేశంలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం కేసుకు సంబంధించిన ఛార్జిషీటులో మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం భార్య నళిని చిదంబరం పేరును చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం కోర్టు సమర్పించిన అదనపు ఆరో చార్జిషీటులో సీబీఐ అధికారులు నళిని పేరును చేర్చినట్లు ఆ శాఖ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అయితే, ఆమెను ఇందులో నిందితురాలిగా చేర్చారా లేక సాక్షిగా చేర్చారా అనే వివరాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం కేసు ఉన్న పరిస్థితిలో ఎలాంటి వివరాలు తెలిపేందుకు కూడా సీబీఐ అధికారులు నిరాకరించారు. 'శారదా కుంభకోణం కేసులో నిందితుడైన మనోరంజన సింగ్కు ఆమె(నళిని వ్యక్తిగత న్యాయవాది. శారదా సంస్థ ద్వారానే ఆమెకు ఫీజు చెల్లిస్తూ వస్తున్నారు' అని ఓ సీబీఐ అధికారి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement