ఆ రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు

Chhattisgarh Board cancels pending 10th and 12th class exams - Sakshi

రాయ్‌పూర్‌ : దేశంలో కరోనా వైరస్‌ విభృంభిస్తున్న తరుణంలో మధ్యలో ఆగిన (పది, ఇంటర్‌) పరీక్షల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు పది, ఇంటర్‌ పరీక్షలను జూన్‌ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల పరీక్షలపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది, ఇంటర్‌ పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. విద్యార్థులు పరీక్షలు రాయకుండానే అందరినీ పాస్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. (జూలైలో పది పరీక్షలు)

ఇంటర్నల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా.. విద్యార్థులకు  మార్కులు కేటాయించనున్నారు. దీని ఆధారంగానే పై చదువులకు ప్రమోట్‌ చేయనున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావించింది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షులు నిర్వహించిన ఫలితాలు విడుల చేసేలోపు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా శాఖ అభిప్రాయపడింది. ఈనేపథ్యంలో విద్యార్థులందరనీ పాస్‌ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థులు, తల్లీదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే దారిలో పంజాబ్‌ ప్రభుత్వం కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. (ఏపీలో మరో 36 పాజిటివ్‌ కేసులు)

ఇక తెలంగాణలోనూ పది పరీక్షలు మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. వీటిని జూన్‌ మొదటి వారంలో తిరిగి ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ చెబుతోంది. అప్పటిలోపు పరిస్థితి అదుపులోకే వస్తే పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు, సలహాలు చేసింది. (దూరం 250 కిమీ.. టికెట్‌ ధర 12వేలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top