చాకచక్యంగా చిరుతను బంధించిన మహిళ | Sakshi
Sakshi News home page

చాకచక్యంగా చిరుతను బంధించిన మహిళ

Published Wed, Aug 20 2014 2:20 AM

Cheetah captured woman as tactically

చెన్నై: గొర్రెల కొట్టంలోకి చొరబడిన చిరుతపులిని ఓ మహిళ చాకచక్యంగా బంధించిన సంఘటన తమిళనాడులోని నీలగిరి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ముదుమలై పంచాయతీ నందిగుండు ప్రాంతంలో శశిధరన్‌కు చెందిన గొర్రెల కొట్టంలోకి ఒక చిరుత చొరబడి ంది. ఒక గొర్రెను చంపి అక్కడే తింటూ కూర్చుంది. కొట్టం నుంచి వస్తున్న శబ్దానికి  తెల్లవారుజాము 4 గంటల సమయంలో మేలుకున్న శశిధరన్ భార్య యమున పులిని గుర్తించింది.

దానిని ఎలాగైనా బంధించాలని నిశ్చయించుకున్న ఆమె.. మెల్లగా వెళ్లి కొట్టం ద్వారానికి తాళంవేసింది. తరువాత భార్యాభర్తలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మత్తు ఇంజక్షను ఇచ్చి పులిని తీసుకెళ్లారు. తమ కొట్టంలోకి ప్రవేశించిన పులిని చూడగానే భయంతో కేకలు వేయకుండా ఒంటరిగా వెళ్లి దాని గేటుకు తాళం వేసిన యమున ధైర్య సాహసాలను స్థానికులు కొనియాడారు.
 

Advertisement
Advertisement