ప్రారంభమైన చార్‌ధామ్‌ యాత్ర | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన చార్‌ధామ్‌ యాత్ర

Published Wed, May 8 2019 3:44 AM

Char Dham Yatra begins in Uttarakhand, portals of Gangotri and Yamunotri temples open - Sakshi

ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు గంగ, యమునా దేవతల విగ్రహాలను ముకాభా, కర్సాలీ నుంచి తీసుకొచ్చి పునఃప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఈ నెల 9న, బద్రీనాథ్‌ ఆలయాన్ని 10న తెరవనున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్‌–నవంబర్‌ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్‌– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. 

Advertisement
 
Advertisement