నేర అతిథులపై నిఘా!  | Changes in visa rules | Sakshi
Sakshi News home page

నేర అతిథులపై నిఘా! 

Oct 27 2018 3:11 AM | Updated on Oct 27 2018 3:11 AM

Changes in visa rules - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అతిథి దేవో భవ అన్నది భారతీయ సంప్రదాయం. కానీ, వచ్చే అతిథుల్లో కొందరు వక్రబుద్ధిగలవారూ ఉంటారు. ఇలాంటివారిని వడబోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే, భారత ప్ర భుత్వం పర్యాటక వీసాల్లో స్వల్ప మార్పులు చేసింది. దీనివల్ల నేర చరిత్ర ఉన్నవారికి వీసా మంజూరులో కఠినంగా వ్యవహరించనున్నారు.  

ఎందుకీ మార్పులు? 
వాస్తవానికి పర్యాటక ప్రదేశాల సందర్శనకు వచ్చే విదేశీయుల నేర చరిత్రపై గతంలో ఎలాంటి నిబంధనలు లేవు. కొంతకాలంగా మనదేశానికి వచ్చే విదేశీయుల్లో కొందరు ఇక్కడి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీనిపై కేంద్రమంత్రి మేనకా గాంధీ స్వయంగా కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలకు ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేశారు. మేనకాగాంధీ చొ రవతో వీసా నిబంధనల్లో మార్పులు చేశారు. ఇది ప్రస్తుతం అమల్లోకి వచ్చిందని సోమవా రం మేనకాగాంధీ ప్రకటించారు. చిన్నపిల్లలపై వేధింపులు, ఇతర నేరాలకు పాల్పడిన వి దేశీయులకు ఇపుడు ప్రత్యేక కాలమ్‌ ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా పూర్తిచేయాలి. అందులో అభ్యంతరాలు లేకపోతేనే వీసా మంజూరవుతుంది. లేదంటే తిరస్కరిస్తారు. దీ నిపై పలువురు మహిళలు, బాలల హక్కుల నే తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్‌లో ఎలా ఉంది? 
దేశంలోని చారిత్రక నగరాల్లో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ చరిత్ర ఉన్న భాగ్యనగరాన్ని ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. కేవలం సందర్శనకే కాకుండా మెడికల్‌ టూరిజం, ఐటీ, ఉన్నత విద్య, ఫార్మసీ తదితర రంగాలకు భాగ్యనగరం ప్రసిద్ధి. దీనికితోడు శంషాబాద్‌ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఏటా నగరానికి వచ్చే విదేశీయులు పెరుగుతున్నారు.  మధ్యప్రాచ్యం నుంచి వైద్యానికి, ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి ఉన్నత వి ద్యకు, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పర్యాటకం కోసం నగరానికి వ స్తున్నారు. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలో జరిగిన మార్పులను అందరూ ప్రశంసిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement