‘ఈశాన్య’ అభ్యర్థుల ఎత్తు కుదింపు

Centre Relaxed Height Norms For Northeast ST Candidates - Sakshi

న్యూఢిల్లీ: భారత పారామిలటరీ బలగాల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని ఆదివాసీ యువకులు, గూర్ఖాల చేరికను పెంచేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పారామిలటరీ బలగాల్లో కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు దరఖాస్తు చేసే పురుష అభ్యర్థుల కనీస ఎత్తును తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది.

కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్‌ పోస్టుకు ఆదివాసీ యువకుల కనీస ఎత్తును 162.5 సెంటిమీటర్ల నుంచి 157 సెంటిమీటర్లకు తగ్గించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం(సీఐఎస్‌ఎఫ్‌)లో ఏఎస్సై పోస్టుకు ఆదివాసీ, గూర్ఖా యువకుల కనీస ఎత్తు 162.5 సెం.మీ, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు 157 సెంటిమీటర్లు ఉండాల్సిందిగా నిర్ధారించారు. ఈ నిబంధనలు సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, అస్సామ్‌ రైఫిల్స్‌ వంటి సంస్థలకు వర్తిస్తాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top