ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరానికి షాక్‌

CBI Gets Law Ministrys Nod To Prosecute Chidambaram - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, కేం‍ద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటుండగా తాజాగా చిదంబరంను ప్రాసిక్యూట్‌ చేసేందుకు సీబీఐకి న్యాయమంత్రిత్వ శాఖ అనుమతి లభించింది. కేసులో సేకరించిన సాక్ష్యాధారాలను సమర్పించిన మీదట చిదంబరంపై న్యాయపరమైన చర్యలతో ముందుకెళ్లేందుకు గతంలో న్యాయమంత్రిత్వ శాఖను దర్యాప్తు సంస్ధ ఆశ్రయించిన సంగతి తెలసిందే.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం కస్టడీ విచారణ అవసరమని సీబీఐ, ఈడీ ఈనెల 25న ఢిల్లీ హైకోర్టులో పేర్కొన్నాయి. కాగా ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో చిదంబరాన్ని ప్రాసిక్యూట్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన క్రమంలో తాజా పరిణామాలు ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు క్లియరెన్స్‌ ఇచ్చే క్రమంలో పెద్దమొత్తంలో ముడుపులు ముట్టాయని చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై సీబీఐ ఆరోపిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top