నాకు ప్రాణహాని.. భారత్‌కు రాను: నీరవ్‌ | Can't Return To India Said Nirav Modi | Sakshi
Sakshi News home page

నాకు ప్రాణహాని.. భారత్‌కు రాను: నీరవ్‌

Dec 2 2018 10:32 AM | Updated on Dec 2 2018 10:33 AM

Can't Return To India Said Nirav Modi - Sakshi

ముంబై: బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి భారత్‌లో ప్రాణహాని కలిగే అవకాశం ఉందని, అందుకే ఆయన దేశానికి రాలేకపోతున్నట్లు అతని తరఫు న్యాయవాది శనివారం ఇక్కడి ప్రత్యేక కోర్టుకు విన్నవించారు. విచారణలో భాగంగా నీరవ్‌ తరఫున లాయర్‌ విజయ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపించారు.  అతను దేశానికి వస్తే ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు మూకదాడులు జరిపే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. వీరి వాదనను ఈడీ తోసిపుచ్చింది. ఒకవేళ నీరవ్‌కు నిజంగా ప్రాణహాని కలిగే అవకాశం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి గానీ, ఇలా దర్యాప్తుకు సహకరించపోవడం తగదని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement