ఈ కొమ్మల్లో ఎంతమంది ఉన్నారో చెప్పగలరా? | Can you work out how many faces are hidden in the tree? | Sakshi
Sakshi News home page

ఈ కొమ్మల్లో ఎంతమంది ఉన్నారో చెప్పగలరా?

Jan 3 2016 5:32 PM | Updated on Oct 17 2018 4:29 PM

కళ్లను కనికట్టు చేస్తూ నెటిజన్ల మెదళ్లకు పదును పెడుతున్న పజిల్‌లాంటి ఈ చిత్రం చాలాకాలంగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

                                                                                  

కళ్లను కనికట్టు చేస్తూ నెటిజన్ల మెదళ్లకు పదును పెడుతున్న పజిల్‌లాంటి ఈ చిత్రం చాలాకాలంగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. చాలాకాలంగా ఈ కనికట్టు చిత్రానికి నెట్టింట్లో ఆదరణ లభిస్తూనే ఉంది. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఛాయాచిత్రం మరోసారి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చూడటానికి చెట్టులానే కనిపిస్తూ కాస్తా పరిశీలించి చూస్తే.. కొమ్మల ఆకృతుల్లో ఎందరో మహానేతల ముఖాలు దర్శనమివ్వడమే ఈ చిత్రంలోని ప్రత్యేకత. ఈ చిత్రం ఎప్పటిది.. ఏ చిత్రకారుడు దీనిని వేశారనే చర్చ చాలాకాలంగా నడుస్తున్నది. దీని చిత్రకారుడు ఎవరన్నది ఇదమిత్థంగా తెలియకపోయినా.. 1880లో హార్పర్స్ బొమ్మల పత్రిక కోసం దీనిని చిత్రించి ఉంటారనే వాదన వినిపిస్తున్నది.

అయితే, ఈ చిత్రంలో కనిపిస్తున్న మహా నాయకులంతా భారతీయులే. మహాత్మాగాంధీ, జవహార్‌లాల్‌ నెహ్రూ, బాలాగంగాధర్‌ తిలక్‌, భగత్‌సింగ్, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ వంటి ప్రముఖ నాయకుల ముఖాలను ఇందులో చూడవచ్చు. కాబట్టి భారతీయ చిత్రకారుడు వేసిన చిత్రం అయి ఉంటుందని, 1880 నాటి చిత్రం కాకపోవచ్చునని మరికొందరు భావిస్తున్నారు. ఇందులో మార్గరేట్‌ థాచర్‌, మైఖేల్ గోర్భచేవ్‌ వంటి విదేశీ నాయకుల ముఖాలు కూడా ఉన్నాయని ఫారిన్‌ నెటిజన్లు భావిస్తున్నారు. మొత్తానికి ఈ చెట్టు కొమ్మల్లో ఎంతమంది ముఖాలు ఉన్నాయన్నది ఇప్పటికీ ఆన్‌లైన్‌లో చర్చనీయాంశమే. నెటిజన్లు చాలామంది 10, 11 మంది ముఖాలు ఉన్నాయంటూ ఊహించి చేసి చెప్పారు. మరీ మీరు కనుక్కొనగలరా? ఈ చెట్టు కొమ్మల్లో ఎంతమంది ఉన్నారో..! సమాధానం తెలియకుంటే కింది చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఇందిరాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ, భగత్‌సింగ్, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌, మహాత్మాగాంధీ, బాలాగంగాధర్‌ తిలక్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, రాజీవ్‌గాంధీ తదితర 11 మంది ముఖచిత్రాలు కలవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement