మమతా బెనర్జీ ప్రయత్నాలకు చెక్! | calcutta high court grants conditional permission for bjp rally | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీ ప్రయత్నాలకు చెక్!

Nov 28 2014 6:11 PM | Updated on Mar 29 2019 6:00 PM

మమతా బెనర్జీ ప్రయత్నాలకు చెక్! - Sakshi

మమతా బెనర్జీ ప్రయత్నాలకు చెక్!

బీజేపీ ర్యాలీని అడ్డుకోవాలన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రయత్నాలకు చెక్ పడింది.

కోల్ కతా:  పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తలపెట్టనున్న ర్యాలీని అడ్డుకోవాలని చూసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలకు చెక్ పడింది. ఆదివారం కోల్ కతాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేపట్టే ర్యాలీకి షరతులతో కూడిన అనుమతులను కోల్ కతా హైకోర్టు మంజూరు చేస్తూ ఆదేశాలు చేసింది. బీజేపీ ర్యాలీతో శాంతి భద్రత సమస్యలు తలెత్తడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలకు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందంటూ మమతా బెనర్జీ ప్రభుత్వ పిటీషన్ దాఖలు చేసిన తెలిసిందే.

 

ఈ పదిరోజుల్లో కోల్ కతాలో ర్యాలీకి తమకు అనుమతులు ఇవ్వాలంటూ బీజేపీ మూడు సార్లు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం చేపట్టిన హైకోర్టు షరతులతో కూడా అనుమతులిస్తూ ఆదేవాలు జారీ చేసింది.  బీజేపీ ర్యాలీ పర్యవేక్షణకు ముగ్గురు సభ్యుల కమిటీని హైకోర్టు నియమించింది.  దీంతో తృణమూల్ కాంగ్రెస్ పై నైతిక విజయం సాధించామని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మమతా బెనర్జీ అప్పీల్ చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement