‘జంజీర్’ రీమేక్‌పై స్టేకు బాంబే హైకోర్టు నిరాకరణ | bombay high court rejects stay of zanjeers remake | Sakshi
Sakshi News home page

‘జంజీర్’ రీమేక్‌పై స్టేకు బాంబే హైకోర్టు నిరాకరణ

Sep 2 2013 7:59 PM | Updated on Sep 1 2017 10:22 PM

గతంలో బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘జంజీర్’ సినిమా రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది.

ముంబై: గతంలో బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన  ‘జంజీర్’ సినిమా రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. దీనిపై కథా రచయితలు సలీమ్‌ఖాన్, జావెద్ అక్తర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. సోమవారం ఈ కేసును విచారించిన బాంబే కోర్టు  ఆ చిత్ర రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు నిరాకరించింది.
 
 

పాత జంజీర్ చిత్ర కథ, స్క్రిప్ట్, డైలాగులకు సంబంధించిన కాపీరైట్లు తమ వద్ద ఉన్నాయని...అందువల్ల అదే పేరుతో దాన్ని రీమేక్ చేసిన నాటి నిర్మాత ప్రకాశ్ మెహ్రా కుమారుల నుంచి రూ. 6 కోట్ల పరిహారం ఇప్పించాలని సలీమ్, జావెద్‌లు కోర్టును కోరారు. తమ స్క్రిప్టు ఆధారంగా ఒకసారి చిత్రాన్ని తెరకెక్కించేందుకే గతంలో ప్రకాశ్ మెహ్రాకు అనుమతి ఇచ్చామన్నారు.
 
 అందువల్ల రెండోసారి తమ అనుమతి లేకుండా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం కుదరదన్నారు. అయితే పిటిషనర్లు ఆలస్యంగా ప్రతివాదులపై కేసు వేయడంతోపాటు స్వయంగా నగదు రూపంలో పరిహారం కోరుతున్నందున ఈ చిత్రంపై స్టే విధించాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. కేసు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌తేజ జంజీర్ రీమేక్ ద్వారా తొలిసారి బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement