ట్రైన్‌–18లో క్యాటరింగ్‌ చార్జీలు తప్పనిసరి

On Board Train 18, You Cannot Choose To Not Have Rail Meal - Sakshi

న్యూఢిల్లీ: త్వరలో పట్టాలెక్కబోతున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌–18)లో క్యాటరింగ్‌ చార్జీలు కూడా టికెట్‌ చార్జీలతో కలిపి ముందే చెల్లించాల్సి ఉంటుంది. శతాబ్ది, రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్‌లోలాగా ఆప్షనల్‌గా తిరస్కరించడానికి ఉండదని అధికారులు వెల్లడించారు. అయితే అలహాబాద్‌–వారణాసి మధ్యలో ఎక్కే ప్రయాణికులకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఈ నెల 15న వారణాసి నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించేందుకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కనుంది.

‘క్యాటరింగ్‌ చార్జీలు రైల్వే టికెట్‌ ధరల్లోనే కలిసుంటాయి. ఈ రైలులో రెండు రకాల క్యాటరింగ్‌ చార్జీలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఢిల్లీ నుంచి వారణాసి వరకు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కింద రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ ఉంటుంది. చెర్‌కార్‌ అయితే అదే భోజన సదుపాయాలకు రూ.344 చెల్లించాల్సి ఉంటుంది. స్టేషన్ల బట్టి ఈ చార్జీల్లో మార్పులుంటాయి. కాగా ఈ రైలు మొత్తం 755 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 8 గంటల్లో ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తుంది. ఈ రైలుకు కాన్పూర్, ప్రయాగరాజ్‌ స్టేషన్లలో స్టాపులుంటాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top