‘ఆయుష్మాన్‌ భారత్‌’ చీఫ్‌గా ఇందు భూషణ్‌ | Bhushan is the chief of 'Ayeshaman Bharat' | Sakshi
Sakshi News home page

‘ఆయుష్మాన్‌ భారత్‌’ చీఫ్‌గా ఇందు భూషణ్‌

Mar 28 2018 2:15 AM | Updated on Mar 28 2018 2:15 AM

Bhushan is the chief of 'Ayeshaman Bharat' - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జాతీయ ఆరోగ్య భద్రతా పథకం ‘ఆయుష్మాన్‌ భారత్‌’కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఇందు భూషణ్‌ నియమితులయ్యారు. ఆయుష్మాన్‌ భారత్‌కు భూషణ్‌ రెండేళ్లపాటు సీఈవోగా కొనసాగుతారని మంగళవారం కేంద్రం ఓ ఉత్తర్వులో పేర్కొంది.

ప్రస్తుతం ఈయన ఫిలిప్పీన్స్‌లోని మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) తూర్పు ఆసియా విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూషణ్‌ అమెరికాలో హెల్త్‌ సైన్సెస్‌లో మాస్టర్స్, ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకంలో భాగంగా దేశంలోని ప్రతీ పేద కుటుంబానికి ఏటా ప్రభుత్వం రూ.5 లక్షల మేర ఉచిత బీమా సౌకర్యం కల్పించనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement