
భోపాల్ : ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కూతురి ద్వారా అతడికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమలనాథ్ ఏర్పాటు చేసిన చివరి మీడియా ప్రతినిధుల సమావేశానికి సదరు జర్నలిస్టు హాజరయ్యారు. ఆ కొద్దిరోజులకే అతడికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ సమావేశానికి హాజరైన మిగితా జర్నలిస్టులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోవాలని కోరారు. కాగా, భారత్‌లో ఇప్పటివరకు 519 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 11 మంది మృత్యువాత పడ్డారు. భోపాల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15గా ఉంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 21రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 21 రోజులు ఎక్కువేనన్న సంగతి తనకు తెలుసునని... కానీ మనల్ని, మన కుటుంబాల్ని రక్షించుకోవటానికి ఇంతకన్నా మార్గం లేదని ఆయన పేర్కొన్నారు.
చదవండి : తమిళనాడులో తొలి కరోనా మరణం