భవిష్యత్తులో జరిగేవి హైబ్రిడ్‌ యుద్ధాలే

Battle tanks must have capability to operate on western, northern border - Sakshi

న్యూఢిల్లీ: భవిష్యత్‌లో సంప్రదాయ ఆయుధాలతో పాటు అంతరిక్షం, సైబర్, సమాచార రంగాలతో కూడుకున్న హైబ్రిడ్‌ యుద్ధాలే జరుగుతాయని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. ‘భవిష్యత్‌లో భారత సాయుధ వాహనాలు–2017’ పేరిట బుధవారమిక్కడ జరిగిన సదస్సులో రావత్‌ మాట్లాడారు. ‘సంప్రదాయ యుద్ధరీతుల్లో పోరాడుతున్నప్పుడు ఉగ్రదాడులు, చొరబాట్లను, పరోక్ష యుద్ధాలను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ఈ రెండింటినీ ఏకకాలంలో ఎదుర్కొనేలా సిద్ధమవ్వాలి. భవిష్యత్‌లో సంప్రదాయ ఆయుధాలతోపాటు అంతరిక్ష, సైబర్, సమాచార రంగాలతో కూడిన హైబ్రిడ్‌ యుద్ధాలే జరుగుతాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు శత్రువుల వద్ద ఉండే ఆయుధ వ్యవస్థలు, సామగ్రి, సాంకేతికతల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని రావత్‌ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top