సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది | bank employees call strike on february 28 | Sakshi
Sakshi News home page

సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది

Jan 31 2017 7:29 PM | Updated on Oct 1 2018 5:24 PM

సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది - Sakshi

సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది

బ్యాంకు ఉద్యోగులు మరోమారు సమ్మెకు దిగుతున్నారు.

చెన్నై: ఎగవేత దారుల నుంచి రుణాల వసూలు, ఐచ్చిక బకాయిదారులపై చర్యలు.. తదితర డిమాండ్లతో బ్యాంకు సిబ్బంది ఫిబ్రవరి 28వ తేదీన సమ్మెకు దిగనున్నారు. ముందుగా మూడు సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని, అయితే మొత్తం 9 యూనియన్లు కూడా ఆందోళనలో పాలుపంచుకోనున్నాయని ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తెలిపారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 28వ తేదీన తలపెట్టిన సమ్మెలో దేశవ్యాప్తంగా పది లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారని వివరించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement