రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ అంత్యక్రియలకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా హాజరు కానున్నారు.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ అంత్యక్రియలకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి వికాస్ స్వరూప్ అధికారికంగా వెల్లడించారు. శుభ్రా ముఖర్జీకి నివాళులు అర్పించేందుకు షేక్ హసీనా భారత్ వచ్చినట్లు. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఈ రోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ ప్రధానిని సాదరంగా రిసీవ్ చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎయిర్పోర్టులో సుష్మా స్వరాజ్, షేక్ హసీనా కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.
కాగా శుభ్రా ముఖర్జీ మృతి సందర్భంగా షేక్ హసీనా నిన్న ప్రణబ్కు ఫోన్ చేసి పరామర్శించారు. శుభ్రా అంత్యక్రియలకు షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా హాజరయ్యారు. శుభ్రా వారికి దగ్గరి స్నేహితురాలు. అనారోగ్యంతో శుభ్రా ముఖర్జీ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఇవాళ ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.