‘మళ్లీ ఆ కష్టాలను గుర్తుకుతెచ్చారు’ | ATMs Running Dry Remind Me Of Demonetisation Days: Mamata Banerjee  | Sakshi
Sakshi News home page

‘మళ్లీ ఆ కష్టాలను గుర్తుకుతెచ్చారు’

Apr 17 2018 3:32 PM | Updated on Aug 25 2018 6:31 PM

ATMs Running Dry Remind Me Of Demonetisation Days: Mamata Banerjee  - Sakshi

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, కోల్‌కతా : దేశవ్యాప్తంగా ఏటీఎంల్లో నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం తిరిగి నోట్ల రద్దు కష్టాలను గుర్తుకుతెస్తోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి నెలకొన్నదా అని సందేహం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ఏటీఎంల్లో నగదు లేకపోవడం, పెద్ద నోట్లు అదృశ్యం కావడం చూస్తుంటే ఇవి నోట్ల రద్దు రోజులను తలపిస్తున్నట్టుగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఏమైనా ఆర్థిక ఎమర్జెన్సీ విధించారా అని ప్రశ్నిస్తూ మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు.

ఏపీ, తెలంగాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా నగదు కొరత నెలకొంది. కాగా, నగదు కొరత తాత్కాలికమేనని రెండు మూడు రోజుల్లో పరిస్థితిని అధిగమిస్తామని, మార్కెట్‌లో తగినంతగా నగదు చెలామణిలో ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement