కునుకు లేకుండా చేస్తున్న వర్షాలు | ap emloyees struck in Chennai floods | Sakshi
Sakshi News home page

కునుకు లేకుండా చేస్తున్న వర్షాలు

Dec 3 2015 1:34 AM | Updated on Aug 18 2018 6:29 PM

కునుకు లేకుండా చేస్తున్న వర్షాలు - Sakshi

కునుకు లేకుండా చేస్తున్న వర్షాలు

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు పరణిపుత్తూర్లోని వృద్ధులకు, చెన్నైలో ఇరుక్కుపోయిన తెలుగువారి కుటుంబాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి.

చెన్నై: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు పరణిపుత్తూర్లోని వృద్ధులకు, చెన్నైలో ఇరుక్కుపోయిన తెలుగువారి కుటుంబాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. పరణిపుత్తూర్ వృద్ధాశ్రమం సగం వరకు మునిగిపోవడంతో  700 మంది వృద్ధుల ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు సమాచారం. గత వారం రోజుల్లో వరదల్లో 22 మంది మృతిచెందారు.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్కు చెందిన 60 మంది ఉద్యోగులు చెన్నై వరదల్లో చిక్కుకున్నారు. గిండి ప్రాంతంలోని సెంట్రల్ ట్రైనింగ్ స్టేషన్లో వరద నీటిలో ఏపీ ఉద్యోగులు చిక్కుకున్నారు. చెన్నై ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న తిరుపతి విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.విద్యార్థుల సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement