హిందూ సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే | "All Hindu saints are anti-national": Another shocker from Pappu Yadav | Sakshi
Sakshi News home page

హిందూ సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే

Mar 7 2016 4:21 PM | Updated on Sep 3 2017 7:12 PM

హిందూ సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే

హిందూ సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే

వివిదాస్పద బిహార్ నేత, మధేపురా ఎంపీ రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పూ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పట్నా:  విదాస్పద బిహార్ నేత, మధేపురా ఎంపీ  రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పూ యాదవ్‌  సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టి చంపితే వారికి రూ. 10 లక్షలు నజరానా ఇస్తానని ప్రకటించిన  ఆయన ఈ సారి తన మాటల యుద్ధాన్ని  హిందు సాధువులు, సన్యాసులపై ఎక్కుపెట్టారు. 

 

హిందూ  సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే అంటూ వివాదాన్ని రగిలించారు. దీంతోపాటుగా జాతి వ్యతిరేక  నినాదాలు చేయడం, జమ్ము కశ్మీర్ లో జాతీయ పతాకాన్ని తగుల బెట్టడం తప్పుకాదని వ్యాఖ్యానించి రాజేశ్ రంజన్ మరో వివాదానికి తెరలేపారు. బిహార్ లో  సోమవారం  మీడియాతో మాట్లాడిన పప్పూ  హిందూ సన్యాసులు,  సాధువులపై ధ్వజమెత్తారు. హిందూ  సాధువులందరూ జాతి వ్యతిరేకులనీ, అందుకే పేదలు దేవాలయాలకు వెళ్లడం మానుకోవాలని పిలుపునిచ్చారు. వారి దోపిడీ దౌర్జన్యాల నుంచి కాపాడుకునేందుకు పేదలు గుళ్లకు వెళ్లకుండా వుండాలన్నారు.  

కాగా అయిదుసార్లు ఎంపీగా గెలిచిన పప్పూ యాదవ్ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటు సౌపాల్ నియోజకవర్గం నుంచి ఆయన భార్య రంజీత్ రంజన్ కాంగ్రెస్ ఎంపీగా  గెలుపొందారు.  లాలూతో విభేదించిన రాజేశ్ రంజన్ ఆర్జేడీ నుంచి బయటకొచ్చి   2015 అసెంబ్లీ ఎన్నికల్లో మధేపురా ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ నుంచి  బహిష్కరణకు గురైన పప్పూ యాదవ్ జన అధికార పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement