అలంగనల్లూరులో జోరుగా జల్లికట్టు | Alanganallur Jallikattu: At least 74 persons injured, 23 admitted | Sakshi
Sakshi News home page

అలంగనల్లూరులో జోరుగా జల్లికట్టు

Feb 11 2017 1:24 AM | Updated on Sep 5 2017 3:23 AM

అలంగనల్లూరులో జోరుగా జల్లికట్టు

అలంగనల్లూరులో జోరుగా జల్లికట్టు

తమిళనాడు మదురై జిల్లా అలంగనల్లూరులో శుక్రవారం జల్లికట్టు జరిగింది.

21 మందికి తీవ్ర గాయాలు
సాక్షి, చెన్నై: తమిళనాడు మదురై జిల్లా అలంగనల్లూరులో శుక్రవారం జల్లికట్టు జరిగింది. ఈ సందర్భంగా 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 60 మందికి స్వల్ప గాయాలయ్యాయి. విజేతలకు కారు, బుల్లెట్‌ వాహనాలు, బహుమతులిచ్చారు.

నిఘా నీడలో జల్లికట్టు: అలంగనల్లూరులో కట్టుదిట్టమైన ఆంక్షలు, నిఘా కెమెరాల కనుసన్నల్లో జల్లికట్టు జరిగింది. తేని, దిండుగల్, మదురై, శివగంౖగై, విరుదు నగర్, తిరుచ్చి, రామనాథపురం, తూత్తుకుడి, తంజావూరు, సేలం, నామక్కల్‌ జిల్లాల నుంచి ఆంబోతులను కదనరంగంలోకి దించారు. గెలిచిన ప్రతి క్రీడాకారుడికి, ఎద్దుకు బంగారు నాణెంతో బహుమతులిచ్చారు. జల్లికట్టును కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ , డీఎంకే నిర్వాహక కార్యదర్శి స్టాలిన్  వీక్షించారు. తాము అధికారంలోకి వచ్చాక జల్లికట్టును శాశ్వతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని స్టాలిన్‌ అన్నారు. అన్నాడీఎంకేలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు వేదిక ఇదికాదని తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement