యూపీకి ఏం చేశారు? | Akhilesh yadav questioned to modi | Sakshi
Sakshi News home page

యూపీకి ఏం చేశారు?

Mar 6 2017 1:15 AM | Updated on Mar 29 2019 9:31 PM

యూపీకి ఏం చేశారు? - Sakshi

యూపీకి ఏం చేశారు?

‘ఉత్తరప్రదేశ్‌ ప్రజలు బీజేపీకి గరిష్టసంఖ్యలో ఎంపీలను అందించారు.

మోదీకి అఖిలేశ్‌ ప్రశ్న
సోనేభద్ర: ‘ఉత్తరప్రదేశ్‌ ప్రజలు బీజేపీకి గరిష్టసంఖ్యలో ఎంపీలను అందించారు. అయితే ఆ పార్టీ వారికేం చేసింది? వారు వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, వారి ప్రధానిని తెచ్చుకున్నారు.

ప్రజలకు భ్రమలు కల్పించి ఉత్తిచేతులు చూపారు’ అని సీఎం, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌.. ప్రధాని మోదీని విమర్శించారు. మొత్తం ప్రపంచమంతా తిరిగిన మోదీ.. యూపీ ప్రజల కోసం ఏం తెచ్చారని ఆదివారమిక్కడ జరిగిన ఎన్నికల సభలో నిలదీశారు. మూడేళ్లలో తను చేసిన పనులేవో చెప్పాలని తాను ప్రధానికి సవాల్‌ విసిరినా ఆయన ఇంతవరకూ అవేమిటో చెప్పలేదన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement