నిషేధిత వృత్తిలోనే మూడు లక్షల మంది! | about three lakh peole still working as manual scavengers, says minister Gehlot | Sakshi
Sakshi News home page

నిషేధిత వృత్తిలోనే మూడు లక్షల మంది!

Jun 24 2015 6:12 PM | Updated on Sep 3 2017 4:18 AM

నిషేధిత వృత్తిలోనే మూడు లక్షల మంది!

నిషేధిత వృత్తిలోనే మూడు లక్షల మంది!

నిషేధిత మ్యాన్యువల్ స్కావెంజర్ (పాకీ) వృత్తిలో ఇప్పటికీ మూడు లక్షల మంది కొనసాగుతూనే ఉన్నారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ తెలిపారు.

న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మాన్యువల్ స్కావెంజర్ (పాకీ) వృత్తిలో ఇప్పటికీ మూడు లక్షల మంది కొనసాగుతూనే ఉన్నారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ తెలిపారు. చట్టం చేసినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతూ ఉండటాన్ని గర్హిస్తున్నామని, ఆ వృత్తిలో కొనసాగుతున్నవారి వివరాలు తెలపాలని ఆయా రాష్ట్రాలను కోరినట్లు మంత్రి చెప్పారు.

2011 జనగణనలో దేశవ్యాప్తంగా 26 లక్షల బహిరంగ మలవిసర్జన కేంద్రాలు ఉన్నట్లు నమోదయిందని, ఆ గణంకాల ఆధారంగా రమారమి మూడు లక్షల మంది ఇకా ఈ వృత్తిలోనే ఉన్నారని అర్ధమవుతుందని పేర్కొన్నారు. వివరాలు సేకరించిన అనంతరం వారికి పునరావసం కల్పిస్తామన్నారు. బుధవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

ఈ వృత్తి అత్యంత దారుణమైనదిగా భావించిన కోర్టు ఆ విధానాన్ని రద్దుచేయాలని ఆదేశించడంతో 2013 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం 'పాకీ పని రద్దు, వారికి పునరావాసం' చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement