ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే మహేంద్ర యాదవ్ ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే మహేంద్ర యాదవ్ ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆయనను తిస్ హజరీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయనను రిమాండ్ ఇవ్వాలని పోలీసులు కోరనున్నారు.
వికాస్ పురి అసెంబ్లీ నియోజకవర్గానికి మహేంద్ర యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు వేర్వేరు కేసుల్లో ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అరెస్ట్ కావడం గమనార్హం.