పీఎస్ టాయిలెట్‌లో వ్యక్తి ఆత్మహత్య | A man committed suicide in police station toilet | Sakshi
Sakshi News home page

పీఎస్ టాయిలెట్‌లో వ్యక్తి ఆత్మహత్య

Aug 2 2017 6:28 PM | Updated on Aug 28 2018 5:25 PM

ఓ కేసు విషయంలో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి టాయిలెట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

న్యూఢిల్లీ: ఓ కేసు విషయంలో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి టాయిలెట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దేశ రాజధానిలో బుధవారం వెలుగుచూసింది. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురి పోలీస్‌స్టేషన్‌ మరుగుదొడ్లో రాజ్‌కుమార్‌(32) అనే వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్‌ ఓ కేసు విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. అయితే ఏమైంతో తెలియదు, అనూహ్యంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాబు జగ్జీవన్‌రామ్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement