ఒకవైపు సర్జరీ... మరోవైపు క్యాండీక్రష్‌! | A girl played candy crush game while her brain surgery | Sakshi
Sakshi News home page

ఒకవైపు సర్జరీ... మరోవైపు క్యాండీక్రష్‌!

Sep 12 2017 3:10 AM | Updated on Sep 19 2017 4:22 PM

ఒకవైపు సర్జరీ... మరోవైపు క్యాండీక్రష్‌!

ఒకవైపు సర్జరీ... మరోవైపు క్యాండీక్రష్‌!

తమిళనాడుకు చెందిన పదేళ్ల చిన్నారి ఓ వైపు తన మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుంటే మరోవైపు మొబైల్‌లో క్యాండీ క్రష్‌ గేమ్‌ ఆడుకుంది.

చెన్నై: తమిళనాడుకు చెందిన పదేళ్ల చిన్నారి ఓ వైపు తన మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుంటే మరోవైపు మొబైల్‌లో క్యాండీ క్రష్‌ గేమ్‌ ఆడుకుంది. ఐదో తరగతి చదువుతున్న నందిని అనే విద్యార్థినికి ఉన్నట్టుండి మూర్ఛ వచ్చేది. వైద్యులు బాలిక మెదడును స్కాన్‌ చేయగా మస్తిష్కంలో శరీరం ఎడమ భాగాన్ని నియంత్రించే ప్రాంతంలో కణతి ఉన్నట్లు తేలింది. అది ఇంకా పెరుగుతూ పోతే ప్రమాదమనీ బాలికకు వెంటనే ఆపరేషన్‌ చేయాలని చెన్నైలో ని సిమ్స్‌ ఆసుపత్రి డాక్టర్లు సూచించారు.

మామూలుగా అయితే రోగికి మత్తుమందు ఇచ్చి స్పృహలో లేనప్పుడు ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తారు. కానీ కొంత మందికి మాత్రం వారు మెలకువగా ఉండగానే శస్త్రచికిత్స నిర్వహించడం తప్పనిసరి. సరైన భాగంలో ఆపరేషన్‌ చేస్తున్నారో వైద్యులకు అర్థం అవ్వాలంటే రోగి మేల్కొని ఉండాల్సిందే. నందినిది కూడా అలాంటి పరిస్థితేననీ, అందువల్లే మెలకువగా ఉండగానే శస్త్రచికిత్స నిర్వహించాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్‌ చేస్తుంటే నందిని ఏ మాత్రం భయపడకుండా మొబైల్‌లో క్యాం డీ క్రష్‌ గేమ్‌ ఆడుకుందంటూ ఆమె ధైర్యాన్ని వైద్యులు మెచ్చుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement