మే 15 నాటికి 38,220 మరణాలు?

38220 COVID-19 lifeless In India By Mid-May - Sakshi

దేశవ్యాప్తంగా 5.35 లక్షల కరోనా కేసులు

నాలుగు ప్రముఖ సంస్థల అంచనా

దేశంలో కరోనా బాధితుల మరణాలు, కేసులు భారీగా పెరగనున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నాయి ప్రముఖ సంస్థలు. మే 15వ తేదీ నాటి కల్లా కరోనా వైరస్‌తో మరణించే వారి సంఖ్య 38,220కు చేరుకుంటుందని, మొత్తం కేసులు 30 లక్షలకు చేరుకోనుందని ఇవి అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు 76 వేల ఐసీయూ బెడ్లు అవసరం ఉంటాయని లెక్కలు తేల్చాయి. ఇప్పటి వరకు ఇటలీ, న్యూయార్క్‌ల్లో కరోనా మరణాలు, కేసులపై వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయని తెలిపాయి.  జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చి, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(బెంగళూరు), ఐఐటీ బోంబే, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీ(పుణె)ఈ మేరకు ‘కోవిడ్‌–19 మెడ్‌ ఇన్వెంటరీ’ పేరుతో ఈ అంచనాలు రూపొందించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top