ప్పతాగి ఒళ్లు తెలియని స్థితిలో ముగ్గురు వ్యక్తులు రైలుకిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. చెల్లాచెదురుగా పడిపోయిన ఓ మహిళ సహా ముగ్గురి మృతదేహాలు స్థానికంగా బీభత్స వాతావరణాన్ని సృష్టించాయి.
పార్టీ చేసుకుంటూనే పై లోకాలకు..
Dec 25 2015 2:16 PM | Updated on Sep 3 2017 2:34 PM
న్యూఢిల్లీ: అప్పటివరకు మద్యం మత్తులో హుషారుగా జోగుతున్న వారి జీవితాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. తప్పతాగి ఒళ్లు తెలియని స్థితిలో ముగ్గురు వ్యక్తులు రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. చెల్లాచెదురుగా పడిపోయిన ఓ మహిళ సహా ముగ్గురి మృతదేహాలు బీభత్స వాతావరణాన్ని సృష్టించాయి. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సమీప గ్రామం నుంచి బయల్దేరిన రమేష్, సూరజ్భాన్, అతని భార్య మీనా, మరో వ్యక్తితో సహా రైలులో మందుపార్టీ చేసుకుంటున్న సమయంలోనే కింద పడిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన సూరజ్ భాన్ కోలుకుంటే తప్ప ప్రమాదమా... కాదా అనే విషయం తెలియదని వారు భావిస్తున్నారు.
Advertisement
Advertisement