కేంద్ర మంత్రి సృతి ఇరానీ, కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ 2004 ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ లు, డాక్యుమెంట్లు కనిపించడం లేదని ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది.
సృతి, కపిల్ సిబల్ ల డాక్యుమెంట్లు లేవు
Jul 24 2016 10:27 AM | Updated on Sep 4 2017 6:04 AM
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సృతి ఇరానీ, కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ 2004 ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ లు, డాక్యుమెంట్లు కనిపించడం లేదని ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది. వీరిరువురు 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఛాందినీ చౌక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను, సమాచారాన్ని తమవెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఎలక్షన్ కమిషన్ కోర్టుకు వెల్లడించింది. సృతి విద్యార్హతలు అసలైనవి కావని వాటిని పరిశీలించాలని కోర్టులో అహ్మర్ ఖాన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు కేసును అగస్టు 27 కు కేసును వాయిదా వేసింది.
Advertisement
Advertisement