ఇంజిన్ లేకుండానే.. రైలు బోగీలు దౌడ్ | 12 coaches move on tracks without engine at Chandigarh railway station | Sakshi
Sakshi News home page

ఇంజిన్ లేకుండానే.. రైలు బోగీలు దౌడ్

Dec 28 2014 7:01 PM | Updated on Sep 2 2017 6:53 PM

ఇంజిన్ లేకుండానే.. రైలు బోగీలు దౌడ్

ఇంజిన్ లేకుండానే.. రైలు బోగీలు దౌడ్

ఇంజిన్ లేకుండా బోగీలు ప్రయాణించగలవా? అసాధ్యం కదూ! అయితే ఈ వింత సంఘటన చండీగఢ్లో జరిగింది.

చండీగఢ్: రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోవడం, బోగీలు లేకుండానే ఇంజిన్ వెళ్లడం వంటి సంఘటనల గురించి విన్నాం. ఇంజిన్ లేకుండా బోగీలు ప్రయాణించగలవా? అసాధ్యం కదూ! అయితే ఈ వింత సంఘటన చండీగఢ్లో జరిగింది.

చండీగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్పై నిలిపిన 12 రైలు కోచ్లు.. ఇంజిన్కు తగిలించకున్నా వాటంతటవే వెళ్లిపోయాయి. ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వెళ్లాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అన్ని కోచ్లకు ఎయిర్ బ్రేక్స్ వేశామని, అయితే కొందరు దుండగులు చక్రాల ముందు భాగాన్ని (చెక్కతో చేసిన ప్టాపర్స్) తొలగించడంతో ఈ సంఘటన జరిగినట్టు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణ కమిటీ వేసినట్టు తెలిపారు.
 

Advertisement

పోల్

Advertisement