పాక్‌ 1170 సార్లు ఉల్లంఘనలకు పాల్పడింది : ఆర్మీ

103 Terrorists Killed In Jammu Kashmir This Year - Sakshi

న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్ 6 వరకు భద్రతా దళాలు సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమర్చాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి. 2019లో ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌లో 103 మంది ఉగ్రవాదులను హతమార్చగా.. 2018లో ఈ సంఖ్య 254గా ఉందని ఓ న్యూస్‌ ఎజెన్సీ పేర్కొంది. అలాగే 2019లో పాకిస్థాన్ 1,170 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడిందని.. 2018లో 1,629 సార్లు ఉల్లఘించిందని తెలిపింది. 2018లో డిసెంబరు 2 వరకు 238 ఉగ్రవాద కార్యకలాపాలను భద్రతా బలగాలు నిలువరించాయి. అలాగే రాళ్లతో దాడికి పాల్పడే ఘటనలను కూడా  చాలా వరకు తగ్గించగలిగాయి.

అయితే 2018లో 86 మంది భద్రతా సిబ్బంది, 37 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 2017ను ఆపరేషన్‌ ఆలౌట్‌గా చెప్తారు. ఆ ఏడాది జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో 329 ఉగ్ర దాడులు జరగ్గా.. 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం ఈ ఘటనల్లో 74 మంది భద్రతా సిబ్బంది, 36 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top