breaking news
Defence Officials
-
ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం
-
త్రివిధ దళాల అధిపతులతో మోదీ సమావేశం: కీలక విషయాలు
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన.. భారత సాయుధ దళాల అధిపతులతో న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.పాకిస్తాన్ 26 భారత స్థావరాలపై దాడి చేసినందుకు ప్రతిస్పందనగా శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసిన తరువాత ఈ సమావేశం జరిగింది. భారత్.. పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య జరుగుతున్న పరిణామాల గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈరోజు ఉదయం మీడియాకు వివరించారు.భారతదేశంపై పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలు రెచ్చగొట్టేవిగా కనిపిస్తున్నాయని విక్రమ్ మిస్రి నొక్కిచెప్పారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు సంబంధించిన ఆధారాలను అందించడంతో పాటు.. పాకిస్తాన్ ప్రచారం చేస్తున్న అబద్ధాలను బహిర్గతం చేస్తూ శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ.. పాకిస్తాన్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇవి మరింత ఉద్రిక్తతకు దారితీశాయని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం బాధ్యతాయుతంగా ప్రవర్తించిందని అన్నారు. కీలకమైన భారత సైనిక ఆస్తులు, మౌలిక సదుపాయాలను నాశనం చేశామని పాకిస్తాన్ తప్పుడు సమాచారం ప్రచారం చేసుకుంటోందని పేర్కొన్నారు.A high level meeting was chaired by PM @narendramodi at 7, Lok Kalyan Marg. Those who attended the meeting included Defence Minister @rajnathsingh, NSA Ajit Doval, CDS General Anil Chauhan, armed forces chiefs and senior officials. pic.twitter.com/mECIeuREKz— PMO India (@PMOIndia) May 10, 2025 -
ఆపరేషన్ సిందూర్ పై విదేశాంగ, రక్షణశాఖ కీలక ప్రెస్ మీట్
-
103 మంది ఉగ్రవాదుల హతం
న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్ 6 వరకు భద్రతా దళాలు సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమర్చాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి. 2019లో ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌లో 103 మంది ఉగ్రవాదులను హతమార్చగా.. 2018లో ఈ సంఖ్య 254గా ఉందని ఓ న్యూస్ ఎజెన్సీ పేర్కొంది. అలాగే 2019లో పాకిస్థాన్ 1,170 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడిందని.. 2018లో 1,629 సార్లు ఉల్లఘించిందని తెలిపింది. 2018లో డిసెంబరు 2 వరకు 238 ఉగ్రవాద కార్యకలాపాలను భద్రతా బలగాలు నిలువరించాయి. అలాగే రాళ్లతో దాడికి పాల్పడే ఘటనలను కూడా చాలా వరకు తగ్గించగలిగాయి. అయితే 2018లో 86 మంది భద్రతా సిబ్బంది, 37 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 2017ను ఆపరేషన్ ఆలౌట్‌గా చెప్తారు. ఆ ఏడాది జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో 329 ఉగ్ర దాడులు జరగ్గా.. 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం ఈ ఘటనల్లో 74 మంది భద్రతా సిబ్బంది, 36 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
ఇది మా భూమి
* పంద్రాగస్టు వేడుకలను ఇక్కడ నిర్వహించొద్దు * రెవెన్యూ సిబ్బందికి డిఫెన్స్ హెచ్చరిక * మోహరించిన సైనికులు, పోలీసులు * గోల్కొండ కోట వద్ద గడబిడ * నేడు కలెక్టర్ వద్ద పంచాయితీ సాక్షి, హైదరాబాద్: ‘‘ఇదంతా డిఫెన్స్‌కు చెందిన స్థలం. ఈ స్థలంలో ఎవరైనా కాలు మోపితే ఊరుకోం’ అంటూ... సైనిక విభాగానికి చెందిన అధికారులు రెవెన్యూ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం గోల్కొండ కోట వద్ద జరిగిన ఈ సంఘటన హైదరాబాద్ జిల్లా యంత్రాంగాన్ని కుదిపేసింది. కోట దిగువన ఉన్న ఖాళీ ప్రదేశం వద్దకు వందలాది మంది సైనికులు చేరుకున్నారు. అది డిఫెన్స్‌కు చెందిన స్థలంగా బోర్డును కూడా పెట్టేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, డిఫెన్స్ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారనుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు భారీగా మోహరించారు. ఈలోగా అక్కడికి చేరుకున్న రెవెన్యూ ఉన్నతాధికారులు, మిలిటరీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. స్థలానికి సంబంధించి తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను తీసుకొని నేడు జిల్లా కలెక్టర్ వద్దకు పంచాయితీకి రావాలని సూచించారు. డిఫెన్స్ అధికారులు కూడా అందుకు అంగీకరించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఖాళీ ప్రదేశంలో డిఫెన్స్ అధికారులు పెట్టిన బోర్డును రెవెన్యూ అధికారులు పీకేశారు. పరేడ్ పరేషాన్ పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోట వద్ద నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఈ సంఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరణకు ఏ ఇబ్బందులూ లేకున్నా ఈ సందర్భంగా నిర్వహించనున్న పోలీసు పరేడ్తోనే సమస్యలు చుట్టుముట్టాయి. పరేడ్ కోసం కోట వెనుక భాగాన 244, 245, 246 సర్వే నంబర్లలో ఉన్న 51 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసిన అధికారులు మంగళవారం సాయంత్రం వరకు సర్వే నిర్వహించారు. అనంతరం ఆ స్థలం తమదంటూ డిఫెన్స్ అధికారులు సీన్లోకి వచ్చారు. ముందస్తుగా ప్రభుత్వం డిఫెన్స్ అధికారుల నుంచి అనుమతి తీసుకుని ఉంటే ఈ సంఘటన చోటుచేసుకునేది కాదని మిలిటరీ ఆధీనంలో ఉన్న పరేడ్ గ్రౌండ్స్‌లో ఏటా ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించడం పరిపాటేననీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గోల్కొండ ఆర్కియాలజీ శాఖ పరిధిలో ఉన్నందున ఆ విభాగం నుంచి అనుమతి కోరుతూ టీ సర్కారు ఓ లేఖ రాసింది. అలాగే డిఫెన్స్వారినీ అనుమతి కోరనుంది.