
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన.. భారత సాయుధ దళాల అధిపతులతో న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.
పాకిస్తాన్ 26 భారత స్థావరాలపై దాడి చేసినందుకు ప్రతిస్పందనగా శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసిన తరువాత ఈ సమావేశం జరిగింది. భారత్.. పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య జరుగుతున్న పరిణామాల గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈరోజు ఉదయం మీడియాకు వివరించారు.
భారతదేశంపై పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలు రెచ్చగొట్టేవిగా కనిపిస్తున్నాయని విక్రమ్ మిస్రి నొక్కిచెప్పారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు సంబంధించిన ఆధారాలను అందించడంతో పాటు.. పాకిస్తాన్ ప్రచారం చేస్తున్న అబద్ధాలను బహిర్గతం చేస్తూ శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ.. పాకిస్తాన్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇవి మరింత ఉద్రిక్తతకు దారితీశాయని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం బాధ్యతాయుతంగా ప్రవర్తించిందని అన్నారు. కీలకమైన భారత సైనిక ఆస్తులు, మౌలిక సదుపాయాలను నాశనం చేశామని పాకిస్తాన్ తప్పుడు సమాచారం ప్రచారం చేసుకుంటోందని పేర్కొన్నారు.
A high level meeting was chaired by PM @narendramodi at 7, Lok Kalyan Marg. Those who attended the meeting included Defence Minister @rajnathsingh, NSA Ajit Doval, CDS General Anil Chauhan, armed forces chiefs and senior officials. pic.twitter.com/mECIeuREKz
— PMO India (@PMOIndia) May 10, 2025