ఆ ఊరంతా దురదే !

nayakuni thanda villagers are suffering from tail pond water - Sakshi

 టెయిల్‌పాండ్‌ నీరు తాగడంతో వాంతులు, ఒళ్లంతా ఎర్రనిమచ్చలు

 జ్వరాలబారిన పడుతున్న ప్రజలు

 ఆందోళనలో నాయకునితండావాసులు

 వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని వినతి

తిరుమలగిరి(నాగార్జునసాగర్‌): టెయిల్‌పాండ్‌ నీటిని తాగిన ఆ ఊరి జనమంతా దురదబారిన పడ్డారు. ఊరు ఊరంతా ఒళ్లు దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధపడుతోంది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకునితండా గ్రామస్తులు టెయిల్‌పాండ్‌ నీటిని తాగడం ద్వారా గిరిజనులు దురద, వాంతులు, తలనొప్పితో ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి అయిన నీటిని రివర్స్‌ పంపింగ్‌ చేయడంతో ఆ నీళ్లు టెయిల్‌పాండ్‌లోకి వచ్చి నిల్వ ఉండడంతో ఆ నీటిని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు శుద్ధి చేయకుండా నేరుగా మండలంలోని చింతలపాలెం, నాయకునితండాల్లో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌కు పంపిస్తున్నారు. దీంతో ఆనీరు తాగిన వారికి ఒళ్లంతా ఎర్రని మచ్చలు ఏర్పడుతున్నాయి. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కావడం లేదని  ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తండావాసులు కోరుతున్నారు.

 

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top