
యుద్ధం శరణం : రాఖీ స్పెషల్ సాంగ్
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం.
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు(సోమవారం) రాఖీ సందర్భంగా చిత్రయూనిట్ ఓ ఫ్యామిలీ సాంగ్ ను రిలీజ్ చేసింది. 'అక్క చెల్లెల్లకు రాఖీ ఎందుకు కడతారో తెలుసా.. అమ్మా నాన్నల తరువాత వాళ్ల బాధ్యత అన్నా తమ్ముళ్లదే అని' అంటూ రేవతి చెప్పిన హార్ట్ టచింగ్ డైలాగ్స్ తో మొదలైన ఈ సాంగ్ కు శ్రేష్ట సాహిత్యం అందించగా ప్రదీప్ కుమార్ ఆలపించారు.
Here you go guys Enno enno bhavala from #YuddhamSharanam https://t.co/Dhte4EOQ0g thank you for this @viveksagar2
— chaitanya akkineni (@chay_akkineni) 7 August 2017