యుద్ధం ఎవరితో? | yuddam in january first week | Sakshi
Sakshi News home page

యుద్ధం ఎవరితో?

Dec 26 2013 12:35 AM | Updated on Sep 2 2017 1:57 AM

యుద్ధం ఎవరితో?

యుద్ధం ఎవరితో?

తరుణ్, యామి గౌతమ్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘యుద్ధం’. ‘ఎవరితోనైనా’ అనేది ఉపశీర్షిక. భారతి గణేష్ దర్శకుడు. నట్టికుమార్ నిర్మాత.

 తరుణ్, యామి గౌతమ్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘యుద్ధం’. ‘ఎవరితోనైనా’ అనేది ఉపశీర్షిక. భారతి గణేష్ దర్శకుడు. నట్టికుమార్ నిర్మాత. స్వర్గీయ శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించారు. షూటింగ్ ముగించుకొని పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి నట్టికుమార్ చెబుతూ-‘‘శ్రీహరి పాత్ర ఈ చిత్రానికి హైలైట్. ‘ఢీ’లో ఆయన పోషించిన పాత్ర స్థాయిలో ఉంటుందీ పాత్ర. ఈ చిత్రాన్ని శ్రీహరిగారికి అంకితం ఇస్తున్నాం. ఇటీవలే బ్యాంకాక్, పటాయ్ తదితర ప్రాంతాల్లో తరుణ్, యామి గౌతమ్‌పై పాటలను చిత్రీకరించాం. కృష్ణారెడ్డి నృత్యరీతుల్ని సమకూర్చారు. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ వారంలోనే విడుదల చేస్తాం. జనవరి తొలివారంలో సినిమాను 600 థియేటర్లలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జస్వంత్, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: నట్టి క్రాంతి. 
 

Advertisement
 
Advertisement
Advertisement