వక్కంతం వంశీ కథతో... | With the story of vamsi | Sakshi
Sakshi News home page

వక్కంతం వంశీ కథతో...

May 13 2014 10:52 PM | Updated on Mar 22 2019 1:53 PM

వక్కంతం వంశీ కథతో... - Sakshi

వక్కంతం వంశీ కథతో...

పూరీ జగన్నాథ్ మంచి దర్శకుడే కాదు, మంచి రచయిత కూడా. ఆయన కథలు, మాటలు యువతరాన్ని కట్టిపడేస్తాయి. కానీ తొలిసారి ఆయన వేరే రచయిత స్క్రిప్ట్‌తో సినిమా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

పూరీ జగన్నాథ్ మంచి దర్శకుడే కాదు, మంచి రచయిత కూడా. ఆయన కథలు, మాటలు యువతరాన్ని కట్టిపడేస్తాయి. కానీ తొలిసారి ఆయన వేరే రచయిత స్క్రిప్ట్‌తో సినిమా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకెళ్తే- ‘ఎన్టీఆర్-పూరీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో పదేళ్ల క్రితం ‘ఆంధ్రా వాలా’ వచ్చింది. ఇంత విరామం తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. అయితే... ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనే పూరీ కాస్త విభిన్నంగా వెళ్తున్నట్లు తెలిసింది. తొలిసారి వేరే రచయిత స్క్రిప్ట్‌తో ఆయన ఈ సినిమా చేయనున్నారట. ఆ రచయిత ఎవరో కాదు... వక్కంతం వంశీ. ఈ సినిమాకు ‘కుమ్మేస్తా’ అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఆయితే... ఈ సినిమాకు అది టైటిల్ కానేకాదని చిత్రం యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బండ్ల గణేశ్ ఈ చిత్రానికి నిర్మాత. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement