సైమా అవార్డ్స్‌కు నామినేట్ అయిన ‘వాట్ ఏ అమ్మాయి’

టాలీవుడ్‌లో లీడింగ్ పీఆర్వోగా కొనసాగుతున్న ఏలూరు శ్రీను దర్శకుడిగా మారి లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. మా కాలని ఫిగర్, వాట్ ఏ అమ్మాయి అనే టైటిల్స్‌తో రూపొందిన లఘు చిత్రాలు మంచి విజయం సాధించటమే కాదు అవార్డులు రివార్డులను కూడా తెచ్చిపెట్టాయి. తొలి షార్ట్ ఫిలింకు ఓ ప్రముఖ చానల్ నిర్వహించిన కాంపిటీషన్‌లో ఉత్తమ నటి అవార్డు దక్కగా, తాజాగా వాట్ ఏ అమ్మాయి ఏకంగా సైమా అవార్డ్స్ బరిలో నిలిచింది. ఈ షార్ట్ ఫిలింకు సంగీతం అందించిన నరేష్ పెంట ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరిలో నామినేట్ అయ్యాడు.
మెగా అభిమానిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏలూరు శ్రీను తరువాత పీఆర్వోగా కొనసాగుతూనే బస్టాప్, లవర్స్, రోజులు మారాయి, ఒక్క క్షణం, కొత్త జంట, చిత్రం భళారే విచిత్రం, కొబ్బరి మట్ట చిత్రాల్లో నటించాడు. దర్శకత్వంపై మక్కువతో లఘు చిత్రాలను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఏలూరు శ్రీను పలువురు స్టార్ హీరోలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రమోషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి