విశ్వరూపం–2 సూపర్‌! | Vishwaroopam-2 sound effects is superb :kamal | Sakshi
Sakshi News home page

విశ్వరూపం–2 సూపర్‌!

Dec 23 2017 7:43 AM | Updated on Dec 23 2017 7:43 AM

Vishwaroopam-2 sound effects is superb :kamal - Sakshi

తమిళసినిమా: విశ్వరూపం–2 చిత్రం సూపర్బ్‌గా వచ్చిందని ఆ చిత్ర సృష్టికర్త కమలహాసన్‌ పేర్కొన్నారు. ఈయన విశ్వరూపం చిత్ర షూటింగ్‌ సమయంలోనే పార్టు–2ను కూడా చాలా వరకు పూర్తి చేశారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆస్కార్‌ ఫిలింస్‌ సంస్థ విడుదల హక్కులను పొంది చాలా కాలం పూర్తి చేయలేకపోయింది. దీంతో కొన్నేళ్లుగా మూలన పడ్డ విశ్వరూపం చిత్రానికి విముక్తి కలిగించే బాధ్యతను చివరికి కమలహాసనే తీసుకున్నారు. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి నిర్మిస్తున్న విశ్వరూపం–2 చిత్రంలో నటి పూజాకుమార్, ఆండ్రియ కథానాయికలుగా నటించారు. జిబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర తుది షెడ్యూల్‌ షూటింగ్‌ను కమల్‌ ఇటీవలే చెన్నైలో పూర్తి చేశారు.

చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను అమెరికాలో నిర్వహించే పనిలో ఆయన ముమ్మరంగా ఉన్నారు. విశ్వరూపం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను అమెరికాలోనే పూర్తి చేశారన్నది గమనార్హం. ఇప్పుడు విశ్వరూపం-2 చిత్రానికి సౌండ్‌ ఎఫెక్ట్‌ కార్యక్రమాలను కమల్‌ అమెరికాలో రోజుకు 15 గంటల చొప్పున పని చేస్తూ పూర్తి చేశారు. ఈ విషయం గురించి ఆయన ట్విట్టర్‌లో పేర్కొంటూ చిత్ర సౌండ్‌ ఎఫెక్ట్, సన్నివేశాలు సూపర్బ్‌గా వచ్చాయి. ఇందుకు కృషి చేసిన యూనిట్‌ అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని కమల్‌ జనవరి చివరి వారంలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. శభాష్‌ నాయుడు చిత్రాన్ని పూర్తి చేసి ఆపై రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు తాజా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement