
విశాల్
తమిళసినిమా: తనపై ఆరోపణలకు ఆధారాలుంటే బయట పెట్టవచ్చుగా.. మాటలు కాదు..చేతల్లో చూపండి అంటూ నిర్మాతలమండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఈయన వ్యతిరేక వర్గానికి చెందిన దర్శకుడు భారతీరాజా, టీ.రాజేందర్, నటుడు రాధారవి, రితీశ్, రాధాకృష్ణన్ తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విశాల్‌పై ఆరోపణల దండయాత్ర చేసిన విషయం తెలిసిందే.
దీనిపై స్పంధించిన విశాల్ నిర్మాతల మండలి నిధి రూ.7 కోట్లకు సంబంధించిన లెక్కలు చూపలేదు అంటూ ఆరోపణలు చేశారన్నారు. నిజానికి మండలి నిధి విషయంలో అవకతవకలు జరగలేదని, ఎవరూ అక్రమాలకు పాల్పడలేదన్నారు. అంతా భద్రంగానే కాపాడుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. పైరసీ వంటి వాటిని వేళ్లతో అణచివేడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తనపై ఆరోపణలకు ఆధారాలుంటే నిరూపించాలన్నారు. మాటలు కాకుండా చేతల్లో చూపాలని విశాల్ వారికి సవాల్ విసిరారు.