వాళ్లను ఫాలో అవుతున్న విజయ్‌ సేతుపతి | Vijay sethupathi to sport eight looks in his next | Sakshi
Sakshi News home page

వాళ్లను ఫాలో అవుతున్న విజయ్‌ సేతుపతి

Jun 18 2017 6:18 PM | Updated on Sep 5 2017 1:56 PM

వాళ్లను ఫాలో అవుతున్న విజయ్‌ సేతుపతి

వాళ్లను ఫాలో అవుతున్న విజయ్‌ సేతుపతి

ఈ తరం నటీనటులు కొత్తదనం కోసం ఆరాట పడుతున్నారనిపిస్తోంది. చాలా ఏళ్ల క్రితం నడిగర్‌ తిలగం శివాజీగణేశన్‌ నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రల్లో నటించి చరిత్ర సృష్టించారు.

చెన్నై: ఈ తరం నటీనటులు కొత్తదనం కోసం ఆరాట పడుతున్నారనిపిస్తోంది. చాలా ఏళ్ల క్రితం నడిగర్‌ తిలగం శివాజీగణేశన్‌ నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రల్లో నటించి చరిత్ర సృష్టించారు. ఆ తరువాత విశ్వనటుడు కమల్‌హాసన్‌ దశావతారం చిత్రంలో పది పాత్రలు పోషించి ఆ రికార్డును బద్దలు కొట్టారు. తాజాగా వారి బాటలో నటుడు విజయ్‌ సేతుపతి పయనించడానికి సాహసిస్తున్నారు. ఆయన 8 గెటప్‌లలో నటిస్తున్న చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

వరుస విజయాలను అందుకుంటున్న విజయ్‌ సేతుపతి తాజాగా నటిస్తున్న చిత్రాలలో ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్లు ఒకటి. ఇందులో ఆయనతోపాటు యువ నటుడు గౌతమ్‌ కార్తీక్‌ నటిస్తున్నారు. నాయకిగా టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక నటిస్తున్నారు. నవ దర్శకుడు ఆర్ముగ కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి ట్రైబల్‌ నాయకుడిగా నటిస్తున్నారట. ఆయన నగరానికి రావడంతో జరిగే సంఘటనలే చిత్ర కథ. అయితే చిత్రం రెండవ భాగం అంతా అడవుల్లోనే జరుగుతుందని, షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని దర్శకుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement