యూనిట్‌ సభ్యులను సర్‌ప్రైజ్‌ చేసిన విజయ్‌

Vijay Gifts Gold Rings To His Movie Team Members - Sakshi

తమిళ స్టార్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘బిగిల్‌’. తెరి, మెర్సల్‌ వంటి హిట్‌ సినిమాల తర్వాత యువ డైరెక్టర్‌ అట్లీ- విజయ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో బిగిల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇళయదళపతి.. ‘బిగిల్‌’ యూనిట్‌ సభ్యులను సర్‌ప్రైజ్‌ చేశాడు. సినిమా కోసం వివిధ శాఖల్లో పనిచేసిన దాదాపు 400 మందికి బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చాడు.

‘బిగిల్‌’ నిర్మాణ సంస్థకు చెందిన అర్చనా కలపతి సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘ బిగిల్‌ కోసం పనిచేస్తున్న 400 మంది సభ్యులకు ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా చేశారు దళపతి. ఆయన మాపై కురిపించిన ఆప్యాయత ఈరోజును ఎంతో ప్రత్యేకంగా నిలిపింది’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ఇక బిగిల్‌లో నటిస్తున్న వర్ష బొల్లమ్మ కూడా..విజయ్‌ ఇచ్చిన రింగ్‌ చూపుతూ ఫొటో దిగి ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా బిగిల్‌ అంటే విజిల్‌ అని అర్థం. ఇంతవరకు విడుదల చేసిన పోస్టర్లలో విజయ్‌ లుక్స్‌ చూస్తుంటే అతడి క్యారెక్టర్‌లో మూడు నాలుగు షేడ్స్‌ ఉంటాయని అర్థం అవుతోంది. వాటి ప్రకారం విజయ్‌ ఒక గెటప్‌లో యంగ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా కనిపిస్తుండగా, ఇంకో లుక్‌లో కత్తి పట్టుకుని మాస్‌ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా దీపావళికి విడుదల చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top